పుట:తాళ్ళపాక పదసాహిత్యం - తొమ్మిదవ భాగం.pdf/168

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0278-5 దేసాళం సం: 09-167

పల్లవి:

ఆపె నిన్ను దిద్దుకొన నయఁగారుగా
మాపుదాఁకా నూరకున్న మత్తుడవైవుందుగా

చ. 1:

యింతి నీకు మోహించి యింటికి విచ్చేయఁగాఁగా
రంతుల నీవలపెల్లా రచ్చకెక్కెను
కాంతుఁడ యిటుగాకున్న కన్నవారివెంటనెల్లా
పంతపు నీమనసిది పరచై తిరుగుఁగా

చ. 2:

చెలి నిన్ను బుజ్జగించి చెనకి నవ్వఁగాఁగా
యిలపై నీవిటతన మెన్నిక కెక్కె
లలియింతరేఁచకున్న లాగుల నీవయసెల్లా
పలచనై లోలోనె పండి తాఁ గైవాలుఁగా

చ. 3:

నిండుఁగాఁగిటనె యాపై నేరుపరిఁ జేయఁగాఁగా
దుండగవు నీచేఁతలు తుదకెక్కెను
అండనె శ్రీవెంకటేశ అట్టె నన్నుఁ గూడితివి
రండూ నింతగాకున్న రతి చవిగాదుగా