పుట:తాళ్ళపాక పదసాహిత్యం - తొమ్మిదవ భాగం.pdf/167

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0278-4 భైరవి సం: 09-166

పల్లవి:

నాకుఁజూడ నిదె నీవు నావాఁడవు
లోకులమాటకెల్ల లోనైవున్నాఁడవు

చ. 1:

హత్తి నాకాత్మవుగాన అన్నియు విన్నవించితి
చిత్త‌ మెట్టున్నదో చెప్పఁగరాదా
పొత్తులమగఁడవట పొరచి కాఁపురమట
యిత్తల నాపై భక్తి యింకా నీకుఁ గలదా

చ. 2:

అట్టె మన్నింతువుగన ఆనవెట్టి యడిగితి
జట్టిగా మోహము నీ కే సతిపైనయ్యా
చుట్టమ వందరికట చొట్లు నీకిన్నినట
ముట్టేవు నాచన్నులిఁక మోహమిందు గలదా

చ. 3:

నీవు నే నొక్కటిగాఁగ నిజము నిన్నాడించితి
దేవుళ్లు నీకెందరు తెలుపవయ్య
శ్రీవెంకటేశ నేను జిగి నలమేల్మంగను
తావుగాను రమించితి తగులింత గలదా