పుట:తాళ్ళపాక పదసాహిత్యం - తొమ్మిదవ భాగం.pdf/166

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0278-3 సామంతం సం: 09-165

పల్లవి:

నీవే యిన్నిట నిజమరివి
వావిదెలుప యిఁక వద్దయ్యా

చ. 1:

వచ్చినపుడె నీవలపులు దక్కెను
యెచ్చు కుందు లిఁక నేమిటికి
కుచ్చెను కాఁగిట గుఱిగా నిన్నిదె
రచ్చలఁ బెట్టక రావయ్యా

చ. 2:

పలికినపుడె నీ పంతము చెల్లెను
యెలయింపుల పనులేమిటికి
పిలిచీ రతులకుఁ బేరుకొనుచునిను
కొలఁదితేనె వూఁకొనవయ్యా

చ. 3:

కూడినపుడె నీగుణములు దెలిసెను
యేడసుద్దు లిఁకనేలయ్యా
యీడనె శ్రీవెంకటేశ యెనసితిమి
మేడెపు రతులివి మెచ్చవయ్యా