పుట:తాళ్ళపాక పదసాహిత్యం - తొమ్మిదవ భాగం.pdf/165

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0278-2 శ్రీరాగం సం: 09-164

పల్లవి:

వరుసతోనె వచ్చితే వలపులు చవులౌను
అరమరచి విభుఁడు అందేమి సేసీనె

చ. 1:

మనసులో కాంక్షకు మాటాడితేఁ గొంతాస
ననిచినమీఁద మరి నవ్వులింపౌను
చనవుగలిగితేను సరసమాడఁ జెల్లును
పెనఁగేపాటిచేఁతల ప్రియము లీడేరును

చ. 2:

కాయముమీఁది తమికి కనుచూపు గొంతాస
చేయి చేయిఁ గదిసితే సిగ్గులొంటును
ఆయములు గరఁగితే నందిపొందికలు దగు
తోయరాని మొగమోట తుదలుమీరించును

చ. 3:

అట్టె పాయపుమదాల కండనుండాఁ గొంతాస
జట్టిగొన్నయందుమీఁద సన్నలుమేలు
అట్టె శ్రీవెంకటేశుండు అలమేల్మంగను నేఁ
బట్టితి ననుచుఁ గూడెఁ బనులెల్లా దక్కును