పుట:తాళ్ళపాక పదసాహిత్యం - తొమ్మిదవ భాగం.pdf/163

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0277-6 శంకరాభరణం సం: 09-162

పల్లవి:

ఎందుకైనావచ్చు నీతో యేలాటాలు
నిందలాడ మాకేల నీచిత్తమిఁకను

చ. 1:

నగినగి నీతోను ననుపు నటించితేను
యెగసక్కేలివియంటా నేల దూరేవు
పగటున నీతో పలుకకవుండితేను
అగడుసేసి యిట్టె అలిగితివనవా

చ. 2:

యెప్పటివలె నే నీతో యెదురుమాటాడితేను
తప్టులు వట్టితినంటాఁ దలవంచేవు
ముప్పిరి నీతోఁ గనక మోనాననేవుండితేను
కుప్పలూఁ దెప్పలునైన కోపములివెనవా

చ. 3:

నిలిపి కాఁగిట నిన్ను నిబ్బరానఁ గూడితేను
అలయించితినంటా నట్టే చూచేవు
చెలఁగి శ్రీవెంకటేశ సిగ్గున నే నుండితేను
వలవంతతోడి గర్వము లివియనవా