పుట:తాళ్ళపాక పదసాహిత్యం - తొమ్మిదవ భాగం.pdf/161

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0277-4 దేసాళం సం: 09-160

పల్లవి:

ఎక్కడఁ జూచినఁ దానై యీతఁడున్నాఁడు
వెక్కసపు మనపాలి విష్ణుదేవుఁడు

చ. 1:

చూడరె పదారువేలు సొరిది యిండ్లలోన
వేడుక నన్నిరూపులై విఱ్ఱవీఁగీని
జాడతో దేవతలకు జలనిధి దచ్చి తచ్చి
పాడితోడ నమృతము పంచిపెట్టీని

చ. 2:

మొక్కరె రేపల్లెలోన ముంచి యాలమందలలో
నక్కడ గోపాలులతో నాటలాడీని
దిక్కులు సాధించి తనదేవుల నండఁ బెట్టుక
రెక్కల గుఱ్ఱముపై పేరెముదోలీని

చ. 3:

సేవలెల్లాఁ జేయరె శ్రీవెంకటాద్రిమీఁద
వావిరి నందరికిని వరాలిచ్చీని
ఆవల నీవలఁ దానె అంతరాత్మ యిందరికి
భావాలలోన విశ్వరూపముచూపీని