పుట:తాళ్ళపాక పదసాహిత్యం - తొమ్మిదవ భాగం.pdf/158

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0277-1 మధ్యమావతి సం: 09-157

పల్లవి:

సారెకు వలవఁ బోతే చప్పనేకాదా
వూరకుండేవారిఁగంటే వొత్తరాదా నీకు

చ. 1:

మొగము నేఁ జూచితేను ముంచి నీవు నవ్వితివి
యెగసక్యానకో కాక యేపనికో
తెగి అంతేసి లోఁతులు తెలుకొ నెరఁగవు
పగటున నేము నగుఁబాటుగాదా నీకు

చ. 2:

పొంత నేఁ గూచిండితేను పొనిగి చోటిచ్చితివి
యెంత వొల్లఁబెట్లోకాక యేమిటికో
వింతగా నంతేసి వెల్లవిరసేయ నెరఁగవు
యింత దగ్గరితే యెడమియ్యవొద్దా నీకు

చ. 3:

సరసము నే నాడితే సరుగఁ గాఁగిలించితి
విరవుగా నెరిఁగితి వేమిటికో
గరిమ శ్రీ వెంకటేశ కలసితి విదెరఁగ
సరసకు వచ్చితేనె సందుగాదా నీకు