పుట:తాళ్ళపాక పదసాహిత్యం - తొమ్మిదవ భాగం.pdf/156

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0276-5 సాళంగనాట సం: 09-155

పల్లవి:

ఆసోదకాఁడవో అన్నిటా జాణవో
వాసితో నే నుండితేను వలచి వచ్చేవూ

చ. 1:

నీతోడి చలమా నిన్ను దూరఁగలమా
చేతులెత్తి మొక్కిన దించిక వెంగెమా
కాతరించ నిన్న మొన్న కాఁగిలించఁగలమా
యీతల నే రానంటె యింతలోనె కడమా

చ. 2:

దండినెఁ బైతరవా తగునె నీకెరవా
నిండుకొనె వుండితేనె నీకు నగవా
పెండెమిచ్చి నన్నిందాఁకాఁ బిలిపించుకొనవా
వుండినట్టె వుండితేను వొళ్లిగర్వమనవా

చ. 3:

కూటమి నేఁడరుదా కొసరితే బిరుదా
యీటున మనలో నేఁడింత గలదా
గాఁటపు శ్రీవెంకేటశ కలసితి మిట్టెకాదా
నాఁటిసుద్ది దడవితే నను మెచ్చవలదా