పుట:తాళ్ళపాక పదసాహిత్యం - తొమ్మిదవ భాగం.pdf/155

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0276-4 కేదారగౌళ సం: 09-154

పల్లవి:

ఆసుద్దులేల తడవే వాయలేవయ్య
సేసితివి చెప్పినటె చేకొనవయ్యా

చ. 1:

వున్నతి నీవద్దఁ బాయకుండినదె నేరుపు
నిన్నుఁబాసి వుండినదె నేరమి
అన్నియు నిన్ను వెనక ననఁగానేమి
చెన్నుమీరె గతజలసేతుబంధాలు

చ. 2:

సరి నిన్నుఁ బొగడేదె జాణతనము
కరి కరిఁబెట్టేదె గబ్బితనము
యెరవెల్లఁ బాసె దిఁకనేమి
మరలి వెదకు టెండమావులనీళ్లు

చ. 3:

చక్క నీమోము చూచుటె సరసము
వెక్కసపు మారుమోమె విరసము
గక్కన శ్రీవెంకటేశ కలసితివి
యిక్కువ లన్నియు నింక నింటిలోనిధానము