పుట:తాళ్ళపాక పదసాహిత్యం - తొమ్మిదవ భాగం.pdf/153

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0276-2 శంకరాభరణం సం: 09-152

పల్లవి:

నీవు చల్లఁగాబదుకు నీకేల యీగొడవ
నీవలపులకు నెల్ల నేనే గురి

చ. 1:

చెక్కు నొక్కకుర నాచెమట నీచేతనంటి
గక్కన నీకుఁగానైన కరఁగులివి
యెక్కువ నాతాపము నీవేల కట్టుకొనేవు నేఁ
బుక్కట నాలో నెట్టైనఁ బొరలేఁగాని

చ. 2:

కాఁగిలించకుర నాకాఁకల నీమేనువాడి
తీఁగెల నీవల్లనైన తేజములివి
నీఁగని నామరులిదె నీవు చుట్టుకొననేల
ఆఁగి నేనె పొట్టువొరలయ్యేఁగాని

చ. 3:

నామోవి యడుగకుర నానలేదు కడునెండె
వేమరు నీవల్లనైన వెట్టలివి
ఆముకొని శ్రీవెంకటాధిప కూడితి వింక
సోమరినై నాలోనె చొక్కేఁగాని