పుట:తాళ్ళపాక పదసాహిత్యం - తొమ్మిదవ భాగం.pdf/152

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0276-1 ముఖారి సం: 09-151

పల్లవి:

ఎవ్వరికిఁ గలదురా యిటువంటి యనుభవత
యివ్వల నీ వాకెవలె నిటు నోమవలదా

చ. 1:

కంకణాలచేత నీ కరమప్పళించి చెలి
అంకెలఁ గుచాలమీఁద నది మదిమీ
తెంకిఁ గూచుండి కన్నులు తేలవేసి నిన్నుఁ జూచి
కొంకక నీ చెవిలోనఁ గూరి మేమో చెప్పెరా

చ. 2:

వుంగరపువేళ్ల నిన్ను నువిదచెక్కులు నొక్కి
యెంగిలిపొత్తాకు మడి చిచ్చి యిచ్చి
పొంగెటి పులకలతో పొందు చూపి మాటాడి
సంగతిగాఁ గాఁగిలించెఁ జాలదా యీ భాగ్యము

చ. 3:

నిలువుఁ బయ్యదవేసి నీపైఁ బాదముచాఁచి
నలువంకఁ దొడలఁ బెనచి పెనచి
యెలమి శ్రీవెంకటేశ యిటు నిన్నుఁ దెరవేసి
కలసె నిన్నాకె అంతకంటెరా నేను