పుట:తాళ్ళపాక పదసాహిత్యం - తొమ్మిదవ భాగం.pdf/15

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0253-2 ముఖారి సం: 09-014

పల్లవి:

ఏలే చెలియ యీ యింతుల కెల్ల
సోలగిలి నీ చనవు చూపవలెనా

చ. 1:

మిక్కిలి యాతఁడు నీపై మేలు గలఁడంటానె
వెక్కసాన నిందరిలో విఱ్ఱవీఁగేవు
చక్కనివిభుఁడు నీ జవదాఁట కుండితేనె
తక్కక నీ వొకతెవే దక్కఁ గొంటివా

చ. 2:

మనసి చ్చాతఁడు నిన్ను మన్నించె నంటానె
యెనలేక యిందరి నీ వేలఁ జూచేవు
ఘనమైన మోహపుకాంత నవుదు నంటానె
గునియుచు సారె నాడుకొనవలెనా

చ. 3:

అన్నిటాఁ బట్టపురాణి వైతె నవుదువు గాక
వెన్నుఁడు శ్రీవెంకట విభునికిని
వన్నెలు చూపవలెనా వడి నీ సవతులకుఁ
బన్నియాతఁడును నీవె బ్రదుకరమ్మా