పుట:తాళ్ళపాక పదసాహిత్యం - తొమ్మిదవ భాగం.pdf/14

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0253-1 సామంతం సం: 09-013

పల్లవి:

గుట్టువాఁడ వంటాఁ గొసరితి
యిట్టి నీ వంటేది యెఱఁగముగా

చ. 1:

చెక్కుచేతితో సెలవి నవ్వితే
తొక్కేవు పాదాలు దోమటిగా
అక్కర నీ వింత ఆసకాఁడ వవుత
యిక్కడ మాలోనె యెఱఁగముగా

చ. 2:

మంతనాన నీతో మాటలాడితే
సంతసానఁ గొంగు జారించేవు
బంతినె నీ వింత పంతగాఁడ వౌత
యెంత కెంత నేము యెఱఁగముగా

చ. 3:

సిగ్గుతోడనే సేవ సేసితే
యెగ్గు దీర నన్ను నెనసితివి
అగ్గపు శ్రీ వెంకటాధిప యిట్టవుత
హిగ్గిన వేడుక నెఱఁగముగా