పుట:తాళ్ళపాక పదసాహిత్యం - తొమ్మిదవ భాగం.pdf/145

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0273-6 ముఖారి సం: 09-144

పల్లవి:

దొర వైతె నింతలోనె దోసమా యేమి
గరిమ మా వినయాలు కానివా యేమి

చ. 1:

మలసి యీడా నాడ మాట లాడకున్న నేమి
తొలుతె యింటికిరాను దోసమా యేమి
తలఁపిట్టె వుండిన దగ్గరక మానేవా
కలపుకోలుఁదనము కానిదా యేమి

చ. 2:

వడిఁ జుట్టాలముగామా వావి చెడ మందు గద్దా
కడు మమ్ము మన్నించితే కానిదా యేమి
కడకన్నులఁ దేలించి కాఁక రేఁచకున్న నేమి
తొడఁగి విడె మందితే దోసమా యేమి

చ. 3:

చేరి చేరి బుజముపై జెయి వేయకున్న నేమి
దూరక కాఁగిలించితే దోసమా యేమి
యీరీతి శ్రీ వెంకటేశ యిక్కువ నుండి కూడి
గారవించితి యిది కానిదా యేమి