పుట:తాళ్ళపాక పదసాహిత్యం - తొమ్మిదవ భాగం.pdf/142

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0274-3 వరాళి సం: 09-141

పల్లవి:

నేఁడు రేపుఁ జూతు గాని నిలరా నీవు
వాఁడి వాఁడి నా గోరు వద్దురా నీవు

చ. 1:

చేసన్న నేమి గల్లాఁ జెప్పి చూపుదువు గాని
మాసిన చెరఁ గంటక మానరా నీవు
మూసి మరఁగుల కెల్లా ముందట మొక్కుదు గాని
దోసముబంట ననక తొలరా నీవు

చ. 2:

యేమి పని గలిగినా నింతుల నంపుదు గాని
రామలకుఁ గల దింతె రాకురా నీవు
నామీఁద మోహము గల్తె నవ్వులు నవ్వుదు గాని
మోముచూడ సిగ్గయ్యీని మొనసేవు నీవు

చ. 3:

కూట మిది యంత గల్లా గుట్టున నుందువు గాని
పోటిఁ గోల నాడితేనె పోకురా నీవు
మేటివై శ్రీ వెంకటేశ మెచ్చుగాఁ గూడితి విట్టె
గాఁటాన నే నంటి నింతె కల్ల సుమ్మీ నీవు