పుట:తాళ్ళపాక పదసాహిత్యం - తొమ్మిదవ భాగం.pdf/141

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0274-2 కాంబోది సం: 09-140

పల్లవి:

చూచితిఁ దన సరిత సుద్దు లేఁటి కో యమ్మ
చేచేత నిఁక బొంకఁ జెల్ల దో యమ్మా

చ. 1:

జడిసి లోఁతుమాటల జాణతనా లాడీ నన్ను
తడవితేఁ దలదీసి తక్కించీ నమ్మ
చిడుముడి చుల్లరపు సేఁతల మమ్ముఁ జెనకీ
పడుచుమాటలవాని పస యేఁటిదమ్మా

చ. 2:

ఆరీతి నాఱడిఁబెట్టి యంతలో నడుగుకొనీ
గోరఁ బొయ్యేదాని కింత గొడ్డ లేలమ్మ
సారెకు మాటపట్లు సాదించి నడచీని
తీరకుండా జగడాలు తిద్దఁబొయ్యీ నమ్మా

చ. 3:

పొందుగానిమతకాల బో‌దించ వచ్చీని
యిందరిలో నెక్కు డాయ నిఁక నేలమ్మా
అందపు శ్రీ వెంకటేశుఁ డాదరించి కూడె నన్ను
నింద లెల్లఁ బాసె నింక నెమ్మదినే యమ్మా