పుట:తాళ్ళపాక పదసాహిత్యం - తొమ్మిదవ భాగం.pdf/140

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0274-1 సామంతం సం: 09-139

పల్లవి:

ఊరకె తా నుండట్టె నుండుఁగాక
తారుకాణ లైనమీఁదఁ దగవుఁగొంతా

చ. 1:

తనకేమె నాలోనఁ దల వంచు కొంటేను
ననుపులేని చోట నవ్వఁ బొయ్యేదా
అననేలె నన్ను సారె నవ్వలిమో మైతి నంటా
చనవులేని చోట సలిగెఁగొంతా

చ. 2:

చింత యాలె తనకు నేఁ జెక్కిటఁ జే యిడు కొంటే
సంతముగాని చోట సరసములా
యింత యాలె యడమాట లేకతాన నే నుంటే
పంతగాఁడు తాను నేఁ బచరించఁ గలనా

చ. 3:

వలపు చల్లఁగ నేలె వంతుకు నే నలిగితే
చలము సాధించఁగాను జాణతనాలా
యెలమి శ్రీ వెంకటేశుఁ డింత చేసి నన్నుఁ గూడె
కలసిన మీఁద నింక కపటములా