పుట:తాళ్ళపాక పదసాహిత్యం - తొమ్మిదవ భాగం.pdf/139

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0273-6 కాంబోది సం: 09-138

పల్లవి:

అంత నింత నుండి ఆనవెట్టీ రమణుఁడు
అంత లేదుగా నాకు నాయము సోఁకీని

చ. 1:

ఔనె తనకు నాకు నంత పొందా తొలినాఁడు
నానిన వలపులతో నవ్వ వచ్చీని
పోని పోని వుపవేసి పొత్తు గలయ వచ్చీని
నే నోపఁగా యింతేసికి నిద్దుర వచ్చీని

చ. 2:

లేలె తనగురుతు లెస్సగా నెఱుఁగుదునా
వేళ గాదన్నా బందెలు వేయ వచ్చీని
చాలుఁ జాలు వెలువెట్టి సారె నిమ్ము గొనవచ్చీ
తాలిమి లేదుగా నన్నుఁదల్లి విలిచీని

చ. 3:

రావె తానూ నేను రతి నే వూరు కేవూరు
కోవరము నిన్నుఁ బెట్టి కొంగు వట్టీని
శ్రీ వెంకటేశ్వరుఁడు చెక్కు నొక్కి నన్నుఁ గూడె
వావులఁ బోదుగా నాకు వాసులు వుట్టీని