పుట:తాళ్ళపాక పదసాహిత్యం - తొమ్మిదవ భాగం.pdf/137

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0273-4 ముఖారి సం: 09-136

పల్లవి:

ఇంత సేసినట్టి పతి నే మందమే
మంతుకు నెక్కించినట్టి మనసు నే మందమే

చ. 1:

చెక్కునఁ బెట్టెను చేయి చిత్తములోపలి నూయి
యిక్కడ నీసతి భావ మేమందమే
ముక్కునఁ గీలించె వేలు మొనగోర నదె వ్రాలు
మక్కువ యింతసేసిన మరుని నే మందమే

చ. 2:

కన్నుల నించెను నీరు కలిగెఁ బయ్యద జారు
యెన్నఁగ నీ యింతి మోహమే మందమే
పన్నుకొనె నిట్టూర్పు పారదోసె తన నేర్పు
యిన్నిటాను నోముఫల మిఁక నే మందమే

చ. 3:

చెలిపై వేసెను మేను సిగ్గుల మునిఁగెఁ దాను
యెలమి నీ చెలి మర పే మందమే
అలరి శ్రీవెంకటేశుఁ డంతలో విచ్చేసి కూడె
తలఁపు ప్రేరేచినట్టి దైవము నే మందమే