పుట:తాళ్ళపాక పదసాహిత్యం - తొమ్మిదవ భాగం.pdf/135

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0273-2 సామంతం సం: 09-134

పల్లవి:

చాలుఁ జాలుఁ బొగడకు జాణకాఁడే
నాలి నేఁ దనిసితిఁబో నాఁడు నాఁడే

చ. 1:

తనకు వలచినట్టి తరుణి సూర్పనకను
పెను ముక్కుగోసిన బీరగాఁదే
మునుపనె వుపకారము నున్న బలి నట్టె
పనివడి కట్టినట్టి పంతగాఁడే

చ. 2:

కోరి తన్నుఁ గూడినట్టి గొల్లల మానములు
మేర మీరి చేకొనిన మేటివాఁడే
కౌరవులఁ బాండవులఁ గడుఁ జుట్టాల నెల్ల
పోరువెట్టి యంపినట్టి పుణ్యపువాఁడే

చ. 3:

నిండు వురమున నింతి నిలిపి శ్రీ వెంకటాద్రి
కొండమీఁద నెక్కుకొన్న కోడెకాఁడే
అండనిట్టె నన్నుఁ గూడి ఆయము లంటిమెప్పించి
దండియై మెరసినట్టి దైవపువాఁడే