పుట:తాళ్ళపాక పదసాహిత్యం - తొమ్మిదవ భాగం.pdf/129

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0272-2 శుద్దవసంతం సం: 09-128

పల్లవి:

ఎందు వోయీ నింతలోనే
యెందు నుప్పుచింది యినుమడీఁగాకా

చ. 1:

పంతమా నీతోఁ బలుమారును నీ
వెంత సేసినా నెరిఁగేము గాకా
వంతులా మారువడిఁ దిట్టను
అంతయు నొకపక్క నణఁగుండీఁ గాక

చ. 2:

యెమ్మెలా నీతో నెదురాడను నీ
దిమ్ముఁ జేఁతలు దెలిసేము గాక
కమ్మరా నిన్నుఁ గాదనేమా
కిమ్ములా నిన్నుఁ గీర్తించేఁ గాకా

చ. 3:

చలవ నిన్ను సాదించను నీవు
చెలిమిఁ గూడఁగాఁ జేకొంట గాకా
అలరు శ్రీ వెంకటాధీశుడా నీ
వలపు గాగిలె వైపాయఁగాక