పుట:తాళ్ళపాక పదసాహిత్యం - తొమ్మిదవ భాగం.pdf/128

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0272-1 లలిత సం: 09-127

పల్లవి:

చెల్లుఁ జెల్లు నీకు నాకు సిగ్గు మరఁగు
యెల్లభావము గంటి మిఁక నేల మరఁగు

చ. 1:

మోవిమీఁది కెంపులకు మోనమె మరఁగు
కావికన్నులకు నిద్ర కడు మరఁగు
తేవల నిట్టూర్పులకు తీగెనవ్వె మరఁగు
యీవిధాలు గంటి నాతో నిఁక నేల మరఁగు

చ. 2:

చెక్కులచెమటలకు చెంపచేయి మరఁగు
మిక్కిలి వులకలకు మెయిపూఁత మరఁగు
తక్కి మోము వాఁడుటకు తమ్ములము మరఁగు
యిక్కడ నిన్నిఁ గంటి నిఁక నేల మరఁగు

చ. 3:

కూడినకూటమునకు గుట్టు యిదె మరఁగు
జాడల నీ మేనికి నా చన్నుదోయి మరఁగు
వేడుకకు శ్రీ వెంకటేశ వేసాలు నీ మరఁగు
యీడ నిన్నిఁ బచ్చిదేరె నిఁక నేల మరఁగు