పుట:తాళ్ళపాక పదసాహిత్యం - తొమ్మిదవ భాగం.pdf/126

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0271-5 సాళంగం సం: 09-125

పల్లవి:

ఇందుకంటె నేమి సేతు నిదివో నేను
వొందిలిఁ దాఁ బిలిచితే నూఁకొనునా నేను

చ. 1:

ఆనిపట్టి తనతో నలిగి వుందాననా
మోనాన దన కిప్పుడు మొక్కనా నేను
మానుపడి తనపొందు మానితినా తొల్లి టట్టె
కాను కియ్యనా నేఁడు కడనుండి నేను

చ. 2:

గొంటుఁ దనమున నేఁ గోపగించు కుందాననా
వొంటిఁ దలవంచు కొద్ద నుండనా నేను
దంటనై నేఁ జలపట్టి దగ్గర కుందాననా
అంటు ముట్టు గలదాన నాడ నుంటి నేను

చ. 3:

కాంతుఁడు కొంగువట్టఁగాఁ గైకొన కుందాననా
అంతలోనె పరవశ మందనా నేను
చింత దీర నన్నుఁ గూడె శ్రీ వెంకటేశ్వరుఁడు
వింత సొబగుల విఱ్ఱవీఁగనా నేను