పుట:తాళ్ళపాక పదసాహిత్యం - తొమ్మిదవ భాగం.pdf/121

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0270-6 సామంతం సం: 09-120

పల్లవి:

ఇంత యాల అంత యాల యేమాయ నిపు డిట్టె
పంతపు పతికడకె పదరాదా

చ. 1:

చెక్కిటిచేయి యేఁటికే చెలి నీ భావముచూడ
చక్కని తామెరమీఁదఁ జంద్రుఁ డున్నట్టు
యెక్కడి కెక్కడి పొందు లేమి గడించేవె
పక్కన పతికడకె పదరాదా

చ. 2;

వున్నతిఁ గుచాలమీఁద నుసురనే విది యేమె
సన్నపుగాలి కొండల జడిసినట్టు
యెన్నటి కెన్నటి పొందు లిట్లేల సేసేవె
పన్ని నీ పతికడకె పదరాదా

చ. 3:

చేరువఁ గాఁగిటిలోనఁ జెమరించే విది యేమె
చేరు ముత్యా లిటునటుఁ జిందినట్టు
కోరి శ్రీవెంకటపతికూడి మేడ యెక్కెఁ గృపా
పారీణుఁ డాతనొద్దకుఁ బదరాదా