పుట:తాళ్ళపాక పదసాహిత్యం - తొమ్మిదవ భాగం.pdf/120

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0270-5 శ్రీరాగం సం: 09-119

పల్లవి:

ఇంత చాలదా యింతి కిదొకటే
రంతుల రమణుని రప్పించెఁ గనక

చ. 1:

పలికిన పలుకుకు పంతం బొకటే
వెలఁది విభుని నవ్వించెఁ గనక
నిలిచిన నిలువుకు నిచ్చల మొకటే
మలయని పతిఁ బెడ మరలించెఁ గనక

చ. 2:

చూపు చూచుటకు సోద్యం బొకటే
యీపతిఁ జెమటల నెనపెఁ గన
తీపుల నటనకు తేజం బొకటే
కోపపుఁ బతి నూఁ కొనిపంచెఁ గనక

చ. 3:

ఘనమగు రతులకుఁ గైవస మొకటే
పెనఁగుల మైమరపించెఁ గన
వనిత కిదొకటే వడి శ్రీ వెంకట
ఘనుని మన్ననలు గైకొనెఁ గనక