పుట:తాళ్ళపాక పదసాహిత్యం - తొమ్మిదవ భాగం.pdf/119

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0270-4 రామక్రియ సం: 09-118

పల్లవి:

నీవే నే నైతిఁగా నేరుపు నేరాల కేమి
చేవ దేరెఁ జాలు చాలు చెప్పుకు నీ సుద్దులు

చ. 1:

తలఁ పొక్కటాయఁగా తమకము లెన్నియైనా
పలు కొక్కటాయఁగా పంతము లెన్నైనా
చలములు చెల్లెఁగా సాదింపు లెన్నియైనా
చెలువుఁడ చాలుఁ జాలు చెప్పకు నీ సుద్దులు

చ. 2:

చన వెక్కు డాయఁగా సరసాలు గనమైనా
నను పిది గలిగెఁగా నాఁటకము లెన్నైనా
మన విది చెల్లెఁగా మంతనాలు దరచైనా
చెనకకు చాలుఁ జాలు చెప్పకు నీ సుద్దులు

చ. 3:

కూటములు గలిగెఁగా కోరికలు దరచైనా
నీటుమీఁద మిక్కిలిగా నిండుఁ బరవసమైనా
యేటికి శ్రీవెంకటేశ యెనసితి మిద్దరము
చీటికి మాటికి నింకఁ జెప్పకు నీ సుద్దులు