పుట:తాళ్ళపాక పదసాహిత్యం - తొమ్మిదవ భాగం.pdf/117

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0270-2 సామంతం సం: 09-116

పల్లవి:

నీకు నీకె మాకు మాకె నేరుపులు
ఆకడ నీకడ నేమంత కోపఁ గలమా

చ. 1:

మందమిరియాలువో నీమాటలు
నిందలకు గురివో నీనీటులూ
సందడిఁ బెండ్లివో నీ సరసాలూ
అందపు రమణుఁడ నే మంత కోపఁ గలమా

చ. 2:

సూదుల మూటలువో నీ సుద్దులూ కడుఁ
బోది సేసేకొలఁది నీబుద్దులు
గాదెల కొలుచువో నీ గాథలు
ఆదెస నీదెస నే మంత కోపఁ గలమా

చ. 3:

ముట్టితేనె ముయివో నీ మొక్కులు
చెట్టునఁ జేటఁడువో నీచిక్కులు
గుట్టున శ్రీవెంకటేశ కూడితివి యిఁక
నట్టు నిట్టు నిన్ను నాడ నంత కోపఁ గలమా