పుట:తాళ్ళపాక పదసాహిత్యం - తొమ్మిదవ భాగం.pdf/116

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0270-1 నాదరామక్రియ సం: 09-115

పల్లవి:

చెల్లని చేఁతలు చెల్లీఁ జెలియ నీ కిట్లని
అల్లదె నీ పతి నిన్ను నడిగి రమ్మనెనే

చ. 1:

నాతి నీ మోముఁ దమ్మిలో నవ్వువెన్నెలలు గాసె
యీతల నందుకు నిందు కేమి వోదే
నీతుల నీ యెదుటను నీ రమణుఁ డిటు చూచి
ఆతల నీ భావము అడిగి రమ్మనెనే

చ. 2:

కేరి కన్నుఁగలువల కెంపు సూర్యోదయ మాయ
యేరీతి నందుకు నిందు కేమి వోదే
కారణము లేని చేఁత కమ్మర నీ పతి చూచి
ఆరసి నీ భావము అడిగి రమ్మనెనే

చ. 3:

జక్కవచన్నుల మీఁద చంద్రవంక లటు నించి
తక్కి శ్రీవెంకటపతి తానె చూచె
యిక్కువతో నిన్నుఁ గూడి యెదురుమేడ యెక్కి
అక్కడ నీ భావము అడిగి రమ్మనెనే