పుట:తాళ్ళపాక పదసాహిత్యం - తొమ్మిదవ భాగం.pdf/114

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0269-5 కాంబోది సం: 09-113

పల్లవి:

విడు విడరే యీ విధ మేల సతి
బడి బడి నేఁటికి భ్రమయించేరే

చ. 1:

కామాతురమున కలిగిన కాఁకలు
ఆమని పన్నీట నారీనా
నేమపు నీరువట్టు నేతఁ దీరునా
కామిను లేఁటికిఁ గారించేరే

చ. 2:

చిత్తములోపలి చింతలచీఁకటి
యెత్తిన దీపాల నెడసీనా
గుత్తపుటాకలి గుక్కిళ్లఁ దేరునా
యిత్తల సతి నే లేఁచేరే

చ. 3:

శ్రీవెంకటపతిఁ జెందెటి యాసలు
తావుఁ గుంటెనలఁ దనిసీనా
యీవేళనె చెలి నితఁడు గూడెను
నావల మీ రేల నవ్వేరే