పుట:తాళ్ళపాక పదసాహిత్యం - తొమ్మిదవ భాగం.pdf/113

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0269-4 శ్రీరాగం సం: 09-112

పల్లవి:

ఇంతికి నీ వెరవా యిచ్చకా లెరవు గాక
మంతనము నీకు లేదా మారు లేదు గాక

చ. 1:

తలపోఁత గరవా తరుణిట్టె నినుఁ బాసె
కలది నెన్నడు మనె కరవు గాక
పులకలుగొంచమా పొలిఁతి నిన్నిటు చూడ
కొలఁదివాఁడిన మోమె కొంచము గాక

చ. 2:

జాగర మేమి దొడ్డా సతితో నీ వలుగఁగా
తోఁగిన నీటికన్నులె దొడ్డ గాక
బాగుల నిన్నద్దలించ బరవా బొమ్మలను
పాఁగిన యింతికుచాలె పై తరవు కాక

చ. 3:

ఆయములు దాఁకవా అంగజుఁడు చెలి సేసె
దాయపుఁ గోరిక కొనదాఁకదు గాక
యీయెడ శ్రీవెంకటేశ యింతి నిట్టె కూడితివి
మాయలా యిన్నియును నీ మన్ననలె కాక