పుట:తాళ్ళపాక పదసాహిత్యం - తొమ్మిదవ భాగం.pdf/11

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0252-4 హిజ్జిజి సం: 09-010

పల్లవి:

ఏమి చూచే వాపెదిక్కు యెందాఁకాను
నేముసేసేపనిగాదు నెయ్యపు యీవేళను

చ. 1:

చెలి నీతో నవ్వు నవ్వి చెక్కు లెల్లాఁ జెమరించె
వలిపె పావడఁ దుడువఁగరాదా
నిలువెల్లఁ బులకించె నీతో మంతనమాడి
చలివాయఁ బచ్చడ మిచ్చటఁ గప్పరాదా

చ. 2:

కాంత నీపదాలు వాడి కడు దప్పిగొనె నిదె
యింతట మోవితేనియ లియ్యరాదా
చెంత నీపాదా లొత్తి సిగ్గునఁ గుమ్ముడి జారె
కాంతుఁడవు యింతటను కాఁగిలించరాదా

చ. 3:

వనిత నీమోము చూచి వసివాడు వాడీ నదె
వెనుకొని నీవు తెర వేయరాదా
ఘనుఁడ శ్రీ వెంకటేశ కలసితి వింతలోనె
ననిచె నలమేల్మంగ నంటు సేయరాదా