పుట:తాళ్ళపాక పదసాహిత్యం - తొమ్మిదవ భాగం.pdf/10

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0252-3 బౌళి సం: 09-009

పల్లవి:

మానుసులకుఁ దరమా మరి యివి నీకె కాక
ఆనుకొని సేసే వీ దయ్యపు చేఁతలు

చ. 1:

నిండు గొల్లతనమున నీకె తగునయ్య
కొండ యెత్తినట్టి గొడగుల నీడలు
గండపురాకాసివేఁటకాఁడవు నీ కమరును
దుండగపుటూరజాతురబోనాలు

చ. 2:

యిల దేవపిండమవయ్యిన నీ యాటలయ్య
బలుసముద్రాలమీఁది పాటపరువు
అలరు కాముకుఁడవుఅయిన నీకుఁ జెల్లునయ్య
చలమరి బ్రహ్మతోడి చయ్యాటాలు

చ. 3:

కొయ్యరాచవాఁడవు కోరి నీకు నబ్బె నయ్య
పుయ్యక దూలచుట్టాల పోరాటాలు
యియ్యెడ శ్రీవెంకటేశ యేలితి పదారువేల
నెయ్యాన నన్నుఁ గూడితి నిలిచెఁ బైకొసరు