పుట:తాళ్ళపాక పదసాహిత్యం - తొమ్మిదవ భాగం.pdf/109

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0268-6 సామంతం సం: 09-108

పల్లవి:

పోపో నీ పోలికలు పోలుచకురా అయితే
నీ పోలికలసాటె నే నయ్యేనే

చ. 1:

పాముపడుకవాఁడ పట్టకురా ఆ
పామువంటి యారు నీకుఁ బాయదు గదే
గామిడి చక్రమువాఁడ కదియకురా వో
చామ నీ పిఱుఁదు ఘనచక్రము గాదా

చ. 2:

నెమలిచుంగులవాఁడ నిలు నిలరా ఆ
నెమలినడపు లెల్లా నీకు లేదటే
తమి సంకుఁ బేరివాఁడ తడవకురా
అమరె నీ మెడ శంఖ మదె కదవే

చ. 3:

కొండపయి శ్రీ వెంకటేశ కొంకనేలరా ఆ
కొండలకు చాలు నీకుఁ గొలఁదె కదే
నిండుఁ గాఁగిటను నన్ను నించితి వవురా
నిండుఁగళలమోము నెలఁతవు గదవే