పుట:తాళ్ళపాక పదసాహిత్యం - తొమ్మిదవ భాగం.pdf/107

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0268-4 హిజ్జిజి సం: 09-106

పల్లవి:

దక్కె నీకుఁ బంతము తగు నింక సంతము
మక్కువఁ గలసి యనుమాన మింకానా

చ. 1:

పచ్చికస్తూరినామము పాదపులత్తుక లాయ
కొచ్చి పతిమీఁద నేలె కోప మింకాను
నిచ్చ సిరసు విరులు నీకుఁ బాదపజ లాయ
దిచ్చరి నీ యలుకింకాఁ దీర దాయనా

చ. 2:

పతివదనము తమ్మపడిగ మాయ నీకు
మతిఁ జల మింకా నాకు మానదటవే
ఆతని చెక్కు చెమట లర్ఘ్యపాద్యము లాయ
తతి నీగుండె గరఁగదా యింకాను

చ. 3:

మంచి మంచి వుంగరాల మాణిక పు మట్టెలాయ
మంచ మెక్కి వుండి యడమాట లింకానా
వంచనై శ్రీవెంకటేశు వావి వరుసయుఁ గూడె
అంచె రతులఁ గూడితి వాస లింకానా