పుట:తాళ్ళపాక పదసాహిత్యం - తొమ్మిదవ భాగం.pdf/106

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0268-3 రామక్రియ సం: 09-105

పల్లవి:

కందము విందము గాక కన్నులారను
అంది యెండ వెన్నెలైతే న దెవ్వరి మేలు

చ. 1:

కానీవె అందు కేమి కా దనఁగ వచ్చునా
మోనానఁ దానంటేఁ జాలు మొక్కే నేను
పోనీ పోనీ వీరి వారి బుద్దులైన వినెఁగా
అని వేము దియ్యనైతే నదెవ్వరి మేలు

చ. 2:

తనలోనె నవ్వనీవే దాని కేమి దోసమా
వొనర మమ్ముఁ జెనకకుంటేఁ జాలు
కననీ కననీ తన కడలచుట్టరికాలు
అనుమె మిను మైతేన దెవ్వరి మేలు

చ. 3:

మేలు మేలు యిది యేమె మేనవావి బలువా
యీలీల నన్నుఁ గూడె నింతే చాలు
అలరి శ్రీవెంకటేశుఁ డంతటివాఁ డౌఁ గా
ఆలు మగఁ డొక్క టైతేనదెవ్వరి మేలు