పుట:తాళ్ళపాక పదసాహిత్యం - తొమ్మిదవ భాగం.pdf/103

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0262-6 సాళంగం సం: 09-102

పల్లవి:

చెప్పకువే వానిసుద్ది చెవు లెల్లాఁ జిల్లు లయ్యీ
దప్పిదేరెఁ జాలు చాలు తానె బదుక నీవే

చ. 1:

వొక యింతికిఁ బుట్టి వొకరికొడుక ననె
అకట నేఁ దిట్టఁగా దా నటు రోసీనా
వికటించి మేనమామ వీటి కేఁగి తానె చంపే
యెకసక్కీఁడు వీనితో నేఁటి చుట్టరికమే

చ. 2:

కొడుకు దెచ్చినయట్టి కొమ్మలు పదారువేల
యెడరై పెండ్లాడెఁ దన కేఁటి వావే
చిడుముడి గొల్లెతల చీరలు దొంగిలినట్టి
అడిబండనికి నేఁటి యాచారమే

చ. 3:

శ్రీ వెంకటాద్రి మీద శ్రీసతి నురాన మోచె
యీవలఁ దనకు నిఁక నేఁటి సిగ్గే
కావించి నన్నుఁ గూడి కమ్మరఁ బ్రియము చెప్పె
యీవేళ వెనక యెంచ నిఁక నేఁటికే