పుట:తాళ్ళపాక పదసాహిత్యం - తొమ్మిదవ భాగం.pdf/101

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0267-4 బౌళి సం: 09-100

పల్లవి:

అయినట్టయ్యీఁ గాని అల్లాడనే
పయిపూఁత సటమాని పదరాదా

చ. 1:

కన్నులఁ జూడనిదానవు మమ్ముఁ గవకవ నవ్వనేలెనీ
చిన్నిమోమెత్తనిదానవు చెక్కుచెమరించనదియేలె
కన్నె సిగ్గువడ్డదానవు నన్నుఁగడునిక్కిచూడనేలె యీ
పన్నెటి మాయలు మాని పదరాదా

చ. 2:

పొంచి మాటాడనిదానవు మాతో బొమ్మలజంకించనేలె నా
మంచానకు రానిదానవు నీవు మరి వుస్సురననేలె
కంచపు పంతపు దానవు మా కత లాలకించ నేలెయీ
పంచల మాయలు మాని పదరాదా

చ. 3:

వొలిసీ నొల్లనిదానవు నీ వొళ్లు పులకించ నేలె నేఁ
గలసితి శ్రీ వెంకటపతిని
బలిమిఁ బెనఁగేదానవు యిట్టె పరవశ మందనేలెనీ
పలుకుల మాయ మాని పదరాదా