పుట:తాళ్ళపాక పదసాహిత్యం - తొమ్మిదవ భాగం.pdf/100

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0267-3 దేసాళం సం: 09-099

పల్లవి:

ఇందరు సవతులకు నిటు నేనె గురియా
సందడి నాతనినే జరయ రాదా

చ. 1:

కోరి నన్నుఁ జూచి చూచి కోపగించే వది యేమే
ఆరీతి నాతఁడు మాటలాడ కుంటేను
సారె వెంగెమాడేవు చలమున నిది యేమే
రారాఁపై నీ కడకు రాకుంటేనూ

చ. 2:

వున్నట్టె నామాట విని వుస్సురనే వది యేమే
అన్నిటా నాతఁడు మేలమాడఁ దంటాను
కన్నులఁ దప్పక చూచి గదరుకొనే వేమే
మన్నన నాతో సరి మన్నించఁ డనుచు

చ. 3:

నాలి నా యెదుట నీవు నవ్వు నవ్వే వేమే నిన్నుఁ
బోళిమితోఁ బొంది నన్నుఁ బొందె నంటాను
అలరి శ్రీ వెంకటేశుఁ దాతఁడేమి సేసినాను
నీలాగు భాగ్యము గాక నే నేమి సేతునే