పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఐదవ భాగం.pdf/9

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0002-3 ఆహిరి సం: 05-008

పల్లవి:

కోపములిద్దరిలో గోరగించీఁ జూడరే
పైపైనె జవరాలు పంపెడి నింతులను

చ. 1:

అమ్మ విలువఁగనంపె నాతని రమ్మనరే
దిమ్మరై వీదులవెంట దిరిగీనని
కమ్మరఁ గమ్మరనేల కలహమిద్దరిలో
దుమ్ములుగాఁ గస్తూరి ధూళి లేచె మేనులు

చ. 2:

దేవులమ్మ నిలిచీన దేవుని రమ్మనరే
ఆవలనెవ్వతెకు లోనాయెనో యని
తావుల బుగులడిచి తను వెల్లానిదివో
లావాయ జగడాలు లలనకుఁ దనకు

చ. 3:

లకిమమ్మ కేమైనా లంచము లిమ్మనరో
శుకవాణి తలపు మూసుక తియ్యదు
వెకలియై సతిఁగూడె వేంకటేశ్వరుఁడు
ఒకరొకరికి లోలో నొద్దికలు ఘనము