పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఐదవ భాగం.pdf/8

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0002-2 ముఖారి సం: 05-007

పల్లవి:

ఏఁటికి విచ్చేసితివో యెట్టుదెలుసు మాతో
మాటలాడఁగా నీకు మాటవచ్చీఁ జుమ్మీ

చ. 1:

అప్పన గొంటివో లేదొ ఆకెచేత నేఁడైనా
ఇప్పుడే మాయింటిదాఁక నేఁగేనంటా
యిప్పటి యీతమకాన యింతలోని పనికిఁగా
చెప్పక వచ్చిననాకె చేరనీదు సుమ్మీ

చ. 2:

అనుచరించితో లేదో ఆకెనో ముందరనైనా
వెనక నాతోడ నవ్వేవు గాని
ఘనుఁడు వూరకే నన్నుఁ గదిసేవు కడుఁబై-
కొనఁగ నాకె విన్న కోపగించుఁ జుమ్మీ

చ. 3:

ఆరగించితో లేదో ఆకెపాత్తుననే యింత
గారవము లేక మోము కళదేరదు
చేరి కూడితివి నన్ను శ్రీ వేంకటేశుఁడ యింత-
యీరసాన నాకె విన్న యేమనునో సుమ్మీ