పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఐదవ భాగం.pdf/10

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0002-4 ముఖారి సం: 05-009

పల్లవి:

ఆతఁడే యెఱఁగడా ఆకెలాగు
రాతి గుండెతోడఁ దా రాకుంటే మాననీ

చ. 1:

అద్దో నేమెందాఁకానైనాఁ గాచుకుండలేము
వొద్దనే యెంతవడైనా నోసి రావే
అద్దికపువారము నేమమ్మ గడుఁ గోపగించీ
వొద్దువోయ రాకుంటేఁ బోనీవే తాను

చ. 2:

అంతేవో మదిరాక్షి యాడ మాకెదురు చూచీ
ఏంతైనా గద్దుపని యీడనేలోసి
వొంత నూడిగము సేసే పొద్దాయ దేవులకు
కాంతుఁడు మీఁదటియెత్తు గననీవే తాను

చ. 3:

మేలే వేంకటపతి మెల్లనే విచ్చేసినాఁడు
వేళమె అక్కకు విన్నవింతమోసి
అలకించి వుండుదము అందరము వాకిటను
లోలోఁ దానాకెఁ గూడి లోలుఁడాయఁ దాను