పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఐదవ భాగం.pdf/11

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0002-5 ఆహిరి సం: 05-010

పల్లవి:

ఇంత మమ్మిట్లా నెలయించకురా నీ
పంతములన్నియు బార బట్టింతునోరి

చ. 1:

అతిరాజసపు మాటలాడకురా యే-
కతమైన నాచేతఁ గడు నొత్తువోరి
ఇతరులవలె నన్ను నెంచకురా నీఁ
మతి చొచ్చి నీమేను మఱపింతునోరి

చ. 2:

చెలఁగుచు గుంపెనలు సేయకురా నీ-
సిలుగు మాటల నిన్నుఁ జిక్కింతునోరి
చలివలపులు మాపైఁ జల్లకురా యీ-
కులుకు గోళ్ళ నిన్ను గుంపింతు -నోరి

చ. 3:

జంకెనచూపులఁ బగ చాటకురా నే-
నింక నిన్నుఁ బోనియ్య నెంతైన నోరి
లంకెల నీ పొందులు దలఁచకురా తిరు-
వెంకటేశ నానేరుపు వెచ్చింతునోరి