పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఐదవ భాగం.pdf/12

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0002-6 సామంతం సం: 05-011

పల్లవి:

ఇచ్చకాలు నాకు నీకు నిఁక నేలరా నీ-
యచ్చపుఁ గోరిక నాతో నానతీరా వోరి

చ. 1:

అమ్మితి నామేను నీకు నప్పుడె వోరి చూపుఁ-
జిమ్ముల నేఁచకేమైనాఁ జిత్తగించరా
అమ్మకచెల్ల నే నీకు నడ్డమా వోరి యింపు
గుమ్మరింపుచు నాగుట్టు కొల్లగొంటివోరి

చ. 2:

జట్టి గొంటివిదె నన్ను జాలదా వోరి యీ-
చిట్టంట్ల నీవేఁచక చిత్తగించరా
ఎట్టైనా నేనీకింత యెదురా వోరి నీ-
పట్టిన చలమే చెల్లె బాపురా వోరి

చ. 3:

వేసాల వేంకటగిరివిభుఁడా నేఁడోరి నీ-
సేసిన మన్ననలిట్టె చిత్తగించరా
వాసన కస్తూరిమేని వన్నెకాఁడ నీ-
యాసల మేకులే దక్కెనద్దిరా వోరి