పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఐదవ భాగం.pdf/66

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0011-4 కాంభోది సం: 05-065

పల్లవి:

పొందెఱుఁగుదునందువు భోగినందువు నీ-
యందరు సతులకు నేనాకు మడిచిత్తునా

చ. 1:

ఎవ్వతెకైనాఁ జనవిచ్చేవు మెచ్చేవు నీ-
నవ్వులకైనాను మన్ననఁ జూచేవు
అవ్వలి యివ్వలి నీ యంగనల వొద్దను
పవ్వళించి వుండఁగా నే బాదములొత్తుదునా

చ. 2:

ఏపున నెక్కడికైనా నేఁగేవు దాఁగేవు నీ-
కోపాన నాతోనైన మేకులు సేసేవు
వైపున నీవెందుండైనా వచ్చిన నేనంతలో-
నోపికనప్పుడు నీ కూడిగాలు సేతునా

చ. 3:

వేడుకలెందైనాఁ బారవేసేవు నీ-
వాడికచేఁతలెన్నైనా వన్నె వెట్టేవు
ఈడు లేని తిరువేంకటేశ కూడితివి నన్ను
వాడుచు నీ తోడ నేను వాసి చూపఁగలనా