పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఐదవ భాగం.pdf/64

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0011-2 ముఖారి, ఏకతాళి సం: 05-063

పల్లవి:

సన్నపు నవ్వుఁజూపుల చల్లులాఁడి యిప్పు-
డిన్నివిధముల మించె నిదివో తపము

చ. 1:

ఏడునిలువుల పైఁడిమేడమీఁద నుండి నిన్నుఁ
జూడ వేడుకైన మించుఁజూపు లాడి
వాడుచు నీకునెదురు వడిఁజూడ నంతలో నీ-
వేడనుండో విచ్చేసితివిదివో తపము

చ. 2:

కొత్తలయిన మాణికపు కొలువుటోవరిలోన
ముత్తేల చెఱఁగుదూలు మురువులాఁడి
తత్తరానఁ దమకించి తరుణికోరికలెల్ల-
నిత్తునని విచ్చేసితివిదివో తపము

చ. 3:

పుప్పొడితావులు చల్లు పువ్వులచప్పరములో
కొప్పు నన్నుఁ బెట్టుమన్న గుబ్బలాఁడి
తెప్పలుగ నినుఁగూడి తిరువేంకటేశ నిన్ను-
నెప్పుడుఁ బాయకున్నదిదివో తపము