పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఐదవ భాగం.pdf/63

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0011-1 శుద్ధవసంతం సం: 05-062

పల్లవి:

మెచ్చితి బళిరా వోరి మేటిజాణ నన్నుఁ
బచ్చి చేసేదింత నీకు బంతమా లోకానను

చ. 1:

ఏకతాన సొలసి నేనేమి నీతోఁ బలికినా
ఆకెతోనే విన్నవించేవాపఁగ లేక
పైకొని వలచి కిందుపడిన యింతులమాఁట
కాకు సేసే మగవాఁడు గలఁడా లోకానను

చ. 2:

చక్కఁగా నేఁదీసిన సన్నపు నీపై రేక
యెక్కువ నాకెకే చుపేవేతులకును
మక్కువ నిలుపలేని మగువల వెలిపుచ్చి
వెక్కమయినవాఁడు విభుఁడా లోకానను

చ. 3:

ఉండలేక చేతనున్న వుంగరమిచ్చినఁ బోయి
వెండియు నాకెకేయిచ్చి విఱ్ఱవీఁగేవు
కండగట్టుకొంటివా వేంకటరమణుఁడ దీన
బండుసేసితివి నన్ను బాపురా లోకానను