పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఐదవ భాగం.pdf/52

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0009-2 భైరవి. సం: 05-051

పల్లవి:

కాలమెల్లా మోసపోవు కానియ్యరా కల-
కాలమెల్లా జరుపేవు కానియ్యరా

చ. 1:

ఎడపుల జవ్వనపుటింతి నొకతెఁ గూడి
కడలనే తిరిగేవు కానియ్యరా
మెడగట్టుకొకతెకు మేలుఁవాడవై నీవు
కడవ బొంకేవు నాతో కానియ్యరా

చ. 1:

బంగారు మెఱుఁగుచాయ పడఁతినొకతె గూడి
కంగనాడేవు నాతో కానియ్యరా
అంగన నొకతె వెనకమర దాచుకొని చొఁ
క్కంగఁ జేసి ముద్దాడేవు కానియ్యరా

చ. 3:

సంపద గలాసెఁ గూడి సరములాడుచు
కంపులే పూసేవు కానియ్యలా
వెంపరలాడుచు నీ వెంటనొకతె రాఁగా
కంపించకు వేంకటేశ కానియ్యరా