పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఐదవ భాగం.pdf/50

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0008-6 ఆహిరి సం: 05-049

పల్లవి:

ఓ యమ్మా వినరో యమ్మా
మాయలాఁడి మానిని

చ. 1:

ఈ యింతికి విభుఁడిచ్చినా చన-
వేయెడాఁ బోవదిదిగదే
రాయంచ నడపుల రాజసమ్మున
పాయంపు రమణునిఁ బాయదు

చ. 2:

సారె సటములు సందడింపుచు
జారీఁ బయ్యెద సరుగనా
దరి రమణునిఁ దొలఁకుఁ గన్నుల
నీరు నించదు నిలువరే

చ. 3:

అంకించి పిలిచినప్పుడా తిరు-
వేంకటేశ్వరు వెరవున
బొంకు లేని యట్టి పొందు చేకొని
పంకజానన పైకొనే