పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఐదవ భాగం.pdf/49

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0008-5 లలిత సం: 05-048

పల్లవి:

బండి దొక్కెఁ బామునెక్కెఁ బనులెల్లాఁ దక్కె
అండఁ జిక్కె గోపికలకందరికి మొక్కె

చ. 1:

ఈతఁడు దొంగిలె వెన్న యీతఁడు నాకంటెఁ బిన్న
నేతఁ బాల నోలలాడె నిన్న మొన్న
పాతకపు రాకాసిపల్లెలు చూరలుగొన్న-
యేతరిపై నేరమి మాకేఁటికిఁక నెన్న

చ. 2:

కూరిమినీతడు దొల్లి కొనగొనలనే తల్లి (?)
మారాపిళ్ళాడించెనే మారుదల్లి
ఆరుమూరు సేసి విద్యలందరికిఁ బారఁజల్లి
పారితెంచి వోలలాడెఁ బాలవెల్లి

చ. 3:

ముచ్చువలె నిప్పుడుండె మూఁడులోకములు నిండె
రచ్చసేసెఁ జూడరే రాతిగుండె
తచ్చితచ్చి వింటినారి దనుజులనెల్లాఁ జెండె
పచ్చిదేర వేంకటాద్రి పానుపుగాఁ బండె