పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఐదవ భాగం.pdf/48

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0008-4 సామంతం సం: 05-047

పల్లవి:

ఎట్టయినఁ జేయరా నీ విఁకనేలా నన్నుఁ
బట్టకుర పలుమారు పదివేలు వచ్చెను

చ. 1:

ఇంత సేసితివి చాలు నిఁకనేలా తొల్లె
యింతటివాఁడని నిన్నెఱగనా
ఇంతులపై దయగలదిఁక నేలా నీ-
పంతములే నీకుఁజెల్లె పదివేలు వచ్చెను

చ. 2:

ఇచ్చలాడకురా నాతో నికఁనేలా నీ-
యచ్చటమ్ములే నిజమాయఁగా
యెచ్చరిక మఱచితినిఁకనేలా నన్ను
పచ్చిసేయకురా యింత పదివేలు వచ్చెను

చ. 3:

ఇనుమడించె నీచేఁత లిఁకనేలా నీ-
కనుమాయలిన్నియుఁ గంటిమిగా
యెనసి వేంకటపతి యిఁకనేలా నన్నుఁ
బనుపరచితివిట్టే పదివేలు వచ్చెను